కె. ఎస్ రాధాకృష్ణన్

ప్రస్తుత తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని కురుంజకుళం గ్రామంలోని తెలుగు వ్యవసాయ కుటుంబంలో పేరం (కె.ఎస్.) రాధాకృష్ణన్ పుట్టారు. ఉన్నత చదువులు చదివి, న్యాయవాద వృత్తిలో పట్టా పుచ్చుకొన్నారు. రాజమండ్రికి చెందిన సరళను వివాహమాడారు. ఒక రాజకీయ కార్యకర్తగా ఎదిగి, న్యాయ నిపుణులుగా ప్రసిద్ధికెక్కి, మానవ హక్కులు, పర్యావరణం, వ్యవసాయంపై ఎక్కువ దృష్టి సారించారు. అంతేగాక, రచయితగా, కాలమిస్ట్‌గా ప్రాచుర్యం పొందారు.
రాధాకృష్ణన్ రాజకీయ ప్రయాణం అవలోకనం
కె.ఎస్.ఆర్ తన అర్ధ శతాబ్దం పైబడిన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అప్పటి ముఖ్యమంత్రులు కుమారస్వామి కామరాజ్, ఎమ్. జి. రామచంద్రన్, డి. ఎమ్. కె అధినేత కలైంజర్ ఎం. కరుణానిధి(దక్షిణామూర్తి), కుమారి జయలలిత, కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మీ కాంతమ్మ, నీలం సంజీవరెడ్డి, జలంగం వెంగళ రావు, నందమూరి తారక రామారావు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవరాజ్ అర్స్, ఇ.వి.కె. సంపత్ వంటి రాజకీయదిగ్గజాలతో సత్సంబంధాలు ఉండేవి. అంతేగాక, సమీపదేశంమైన శ్రీలంకలోని టి.యు.ఎల్.ఎఫ్. (TULF) అధినేత ఎ. అమృతలింగం మరియు ఎల్.టి.టి. ఇ(LTTE)కి ఒకప్పటి నాయకుడు ప్రభాకరన్ శ్రీలంకలో తమిళుల ఉద్యమానికి నిరంతర మద్దతు ఇచ్చినందుకుగాను తొలినాళ్లలో అపారమైన గౌరవం కె.ఎస్. ఆర్. కలిగిఉండేవారు. వీరేగాక, కవి కన్నదాసన్, పళ నెదుమారన్, రైతు నాయకుడు సి. నారాయణస్వామి నాయుడు వంటివారితో కె.ఎస్.ఆర్కు స్నేహబంధం ఉండేది.
కె.ఎస్.ఆర్. రాజకీయ కార్యకర్తగా, జైళ్ల లోపలి గోడలను చాలాసార్లు చూశాడు!
ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం డి.ఎమ్.కె. పార్టీకి అధికార ప్రతినిధిగా నామినేట్ అయిన అతి పిన్న వయస్కుడైన మొదటి వ్యక్తిగా ప్రసిద్ది పొందాడు. తన యాభై నాలుగు సంత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. అనేకసార్లు జైలుకు వెళ్ళి వచ్చారు. రాజకీయాలలో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చారు. నిష్కళంకమైన ప్రజా జీవితాన్ని గడుపుతున్నారు. మృదుస్వభావి అయిన కె. ఎస్. ఆర్ గారు ప్రజా సంక్షేమంకోసం పాటుపడుతూ రాజకీయ కార్యకలాపాల్లో ఎల్లప్పుడూ విశ్వసనీయమైన, నిజమైన వ్యక్తిత్వాన్ని కలిగిఉన్నారు.
కె.ఎస్.ఆర్. న్యాయవాదిగా నిరంతరం ప్రజలపక్షం!



ప్రజలు ఎదుర్కొంటున్న వ్యవసాయం, పర్యావరణం, మానవ హక్కులకు సంబంధించి సమస్యలను న్యాయస్థానాలలో ఎత్తిచూపుతూ, పరిష్కారాలు, ఉపశమనం కోరుతూ ఉంటారు. అలాగే పశ్చిమ కనుమలలో పర్యావరణ సమస్యల గురించి ఆయన విస్తృతమైన అధ్యయనం చేశారు. పశ్చిమ, తూర్పు కనుమల సంరక్షణలో పర్యావరణ ఆందోళనపై న్యాయస్థానాలు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ( N.G.T) తలుపులు తట్టారు.



కోర్టుల ముందు కె.ఎస్.ఆర్. దాఖలు చేసిన ముఖ్యమైన వాజ్యాలు (PETITIONS):
- కన్నగి ఆలయ రిట్ పిటిషన్ (కేరళ రాష్ట్రంపై తమిళనాడు హక్కులు) WP. NO 8758 / 1988 తేదీ 12-3-1997
- వేలుపిళ్ళై ప్రభాకరన్(LTTE), పాండి బజార్ కాల్పుల సమస్య! SC NO 8/1983, 7వ అదనపు కోర్టు, చెన్నై. 22/23-11-2012తేదీన కొట్టివేయబడింది.
- గురుసామి నాయకర్ మరణశిక్ష రద్దు (తెలుగువాడైన వీరపాండ్య కట్టబొమ్మన వంశానికి చెందినవాడు) WP NO 6262/1984 ఉత్తర్వు 27-9-1984 మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని (హైకోర్టుకు) విన్నవించిన పిటిషన్. కేసు వివరణ - నా పిటిషనర్ కేసు ఇలా ఉంది: 1976లోని ఎస్సీ నెం. 87లో, తిరునెల్వేలిలోని లెర్న్డ్ సెషన్స్ జడ్జి 8.2.1977 తేదీన హత్య నేరానికి పిటిషనర్‌కు మరణశిక్షను విధించారు. ఈ కోర్టు డివిజన్ బెంచ్ 15.6.1977తేదీన తీర్పు ద్వారా శిక్షను నిర్ధారించింది. అప్పీల్ చేసుకునేందుకు అనుమతిని ఈ కోర్టు 28.10.1977తేదీన తోసిపుచ్చింది. మానవతా దృక్పదంలో పరిశీలించాలన్న దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు 11.9.1978న తోసిపుచ్చింది. పిటిషనర్ 20.10.1978న దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను మొదట తమిళనాడు గవర్నర్ తిరస్కరించారు, తరువాత భారత రాష్ట్రపతి 22.8.1981న తిరస్కరించారు. అయితే భారతదేశ న్యాయ చరిత్రలో మొదటిసారిగా, కేవలం రెండు లైన్లతో,(Please save my life…….) టెలిగ్రామ్ గురుస్వామి ప్రాణాలను కాపాడింది.
- ఎన్నికల సమయంలో ఖైదీలకు ఓటు హక్కులు - సుప్రీంకోర్టు WP(C) NO1028 / 1990, తేదీ 17-08- 1999.
- పంచాయతీ రాజ్ సమస్యలు - సుప్రీంకోర్టు WP(C) NO 34/2005 – తేదీ 01-08- 2005.
- కూడంకుళం(అనువిద్యుత్ కేంద్రం) అటామిక్ పవర్ యూనిట్ సమస్యలు(పర్యావరణ సమస్యలు), - WP/ హైకోర్టు మద్రాస్, WP NO 22771 / 2011 – తేదీ: 31.08.2012.
- తమిళనాడు నీటి నిల్వ సంరక్షణ- హైకోర్టు మద్రాస్, WP NO 3039 / 2018.
- తూర్పు,పశ్చిమకనముల పరిరక్షణ - హైకోర్టు మద్రాస్, W P NO 5995 / 2020; NGTC నం. 100 / 2021 (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్, న్యూఢిల్లీ), అంగీకరించబడింది - 20-5-2021.
- ఎన్నికల సంస్కరణలు WP (C) NO 549 / 2020 సుప్రీంకోర్టులో దాఖలు చేయబడింది 21-02- 2021; WP NO 27364/2021 హైకోర్టు, మద్రాస్ 23-12-21న దాఖలు చేయబడంది.
- హెచ్. దేవగౌడ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో కావేరి సమస్య - 28-11-1990న దాఖలు చేయబడింది. WP 29-11-1996న మద్రాస్ హైకోర్టులో అంగీకరించబడింది.
- శ్రీలంక నాయకులు బాలసింగం, డాక్టర్ సత్యేంద్ర, సి. చంద్రహాసన్ బహిష్కరణ సమస్యను వ్యతిరేకిస్తూ - మద్రాస్ హైకోర్టులో దాఖలు
- నిమిరా వైక్కుం నెల్లై, బుక్ లైబ్రరీ ఆర్డర్, WP NO 23943 / 2007 తేదీ 16/07/07.
- ఖుష్వంత్ సింగ్ రాసిన ‘ది కంపెనీ ఆఫ్ ఉమెన్’, పుస్తక నిషేదంపై రిట్ పిటిషన్ - మద్రాస్ హైకోర్టులో దాఖలు
- తమిళనాడు లెజిస్లేటివ్ కౌన్సిల్ పునరుద్ధరణ - WP NO 4399 / 2000 14-3-2000.
- మాజీ భారతదేశ ప్రధాన ఎన్నికల కమీషనర్ టి. ఎన్. శేషన్ రాసిన పుస్తకం(ఇందులోCIA ఏజెంట్ ను ‘అన్న’ గా పేర్కొన్నారు) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, హైదరాబాద్. CS NO 2 / 1995.
- కోవిల్పట్టి(గుడిపల్లి) రైతుల జరిపిన ఆందోళన ర్యాలీలో పోలీసులు జరిపిన కాల్పులలో ఇద్దరు రైతులు మరణించారు. హృదయ జోసెఫ్ రెడ్డియార్,ఎత్తిరాజుల నాయుడు మృతదేహాలను పునః పోస్ట్‌మార్టం కోసం దాఖలు.
- డి. ఎమ్.కె నాయకుడు కరుణానిధిని అర్ధరాత్రి అరెస్ట్ చేసినందుకు నిరసనగా , రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి పిర్యాదు, చెన్నై.
- అన్నా నగర్ రమేష్ పై కేసు, ఎం.కె. స్టాలిన్‌తో (ప్రస్తుత ముఖ్యమంత్రి), కలసి పిర్యాదు SHRC, చెన్నై.
- ఎం.కె. స్టాలిన్ వేలాచెర్రి ఇంట్లో అర్ధరాత్రి పోలీసుల దాడిపై కేసు- SC NO 234 / 2005. SHRC, చెన్నై CR NO 312/ 2003, బెయిల్ పిటిషన్ crl MP 3960 / 2003, మద్రాస్ హైకోర్టు / NHRC, న్యూఢిల్లీ కేసు నెం. 69 / 22 / 2003 / 4.
- మైసూర్ జైలు - తలవాడి తమిళుల నిర్బంధం –వీరప్పన్ కు (గంధపు చెక్కల) సంబంధించిన- కేసు నెం. 423 / 10/ 2005 – 2000, NHRC – న్యూఢిల్లీ.
- వై. గోపాలస్వామి, అన్నామలై మండ్రం, పర్యావరణానికి సంబంధించిన శ్రీలంక సమస్య ............. సమావేశం - SC NO 1/ 2010 - III అదనపు కోర్టు, చెన్నై.
- చెన్నై మెట్రో ట్రాఫిక్ రద్దీ సమస్య మరియు వాహనాల భారీ శబ్ద కాలుష్యాన్ని నివారించండి.
కొన్ని పుస్తకాల శీర్షికలు
- ఉరిమైక్కు కురల్ కొడుప్పోమ్ (కాలమ్స్ - రాజకీయ, ఆర్థిక, మానవ హక్కుల సమస్యల గురించి)
- మనిత ఉరిమైగల్ ఎండ్రల్ ఎన్నా? (మానవ హక్కుల గురించి)
- నిమిర వైక్కుమ్ నెల్లై (తిరునెల్వేలి జిల్లా చరిత్ర)
- తమిళనాడు – 50( ఏభై సంవత్సరాల ప్రస్థానం)
- కరిసల్ కాటిల్ కవితై చోలై భారతి(మహాకవి సుబ్రహ్మణ్య భారతి గురించి)
- ఈళం తమిళుల సమస్య
- సేతు( సేతు సముద్రం ) కెనాల్ ప్రాజెక్ట్
- 123 – భారతదేశం ఓడతే! నిల్!! (యుఎస్‌తో అణు ఒప్పందం)
- తూక్కుక్కు తూక్కు(ఉరిశిక్షకు ఉరి) - మరణ శిక్షను ఆపండి!
- ముల్లై పెరియారు ఆనకట్ట సమస్య
- మానవ హక్కుల చట్టం - కొన్ని గమనికలు
- Dతమిళనాడు శాసన మండలి
- DMK - సామాజిక న్యాయం -ఇంగ్లీష్ – తమిళ భాషలలో ప్రచురితం (DMK పార్టీ ప్రధాన కార్యాలయం ప్రచురణ)
- శ్రీలంకలో శిక్ష నుండి మినహాయింపు
- దివంగత నేత సి. నారాయణసామి నాయుడు నేతృత్వంలోని తమిళనాడు వ్యవసాయ ఆందోళన ఉద్యమ చరిత్ర
- రాష్ట్ర స్వయం ప్రతిపత్తి
- వివిధ దిన, వారపత్రికల్లో కె. ఎస్.ఆర్. కాలమ్స్ - సేకరణ
- తమిళనాడు హక్కులు మరియు పెండింగ్ ప్రాజెక్టులు
- తమిళనాడు నీటి సమస్యలు - వివాదాలు
- వీరపాండియ కట్టబొమ్మన్ వారసత్వం – పంచాలం కురుచి వీర చరితం
- దిగ్గజ నాయకుడు సి. నారాయణసామి నాయుడు నేతృత్వంలో రైతు పోరాటం
- SP నరసింహలు నాయుడు రాసిన దక్షిణ ఇందీస్ సరిధం (ఇది 1919లో ప్రచురించబడింది, ఇప్పుడు కొత్త ఎడిషన్‌గా తిరిగి ప్రచురించబడుతోంది)
- తెలుగు వాడైన సాహిత్య అకాడమీ గ్రహీత ప్రముఖ తమిళ పండితుడు కి.రా(రాజనారాయణ్)పై సుదీర్ఘ సంకలనం.
- భారత రాజ్యాంగంపై వ్యాఖ్యానం - Bhārata rājyāṅgam
And miles to go before I sleep.